Thursday 30 November 2017

నచ్చావు...
ఇదే ఓ సారి నీతో చెప్పాను...
నలుగురితో...నలుగురి మధ్య కూడా...
అపుడు నేను  వణికినట్టు గుర్తు... నువ్వు గమనించావో లేదో...
అదేంటో నచ్చిన సంగతులు,నచ్చిన మనుషులని గురించి ఇష్టంగా చెప్తునపుడు అలానే ఇదవుతుంట!
అప్పుడు నువ్వు కాస్త నవ్వినట్టు కూడా నాకు గుర్తు..
కాస్త అని ఎందుకన్నానంటే నిన్నూ, నీ నవ్వుని ఆ రోజు సరిగా చూడలేదు..
నా కంగారు నాది మరి‌‌....
ఏంటి నవ్వుకుంటున్నావా...‍?
ఆ తర్వాత ఎంతో బాధనిపించింది..
ఎందుకంటే నాకోసమే నువ్వు కనిపెట్టిన ఆ నవ్వుని ఈరోజు వరకూ నువ్వు నాకు చూపించనేలేదు..అంతే స్థిరం గా ఉన్నావ్..అదే ఖచ్చితత్వం..
అంతా బాగుంటుందిలే అని అనుకునేలోపే
నాకే తెలియకుండానే
పొలమారే మాటలతో నీ కళ్ళకి తడి అద్దానని తెలిసి చాలా విలపించాను..
నీకు తెలుసనుకుంటాను నాకు పలుచని తెల్ల కాగితం అంటే అమ్మంత ఇష్టం..
కాని నాకూ దానికి ఎప్పుడూ దెబ్బలాటే..
దానిపై అందమైన అక్షరాలతో రంగులద్దడానకి ప్రయత్నిస్తూ ఎప్పుడూ ఓడిపోతుంటాను.
కాని మొదటిసారి గెలవాలనిపిస్తుంది..
ఎందుకో... అని కోరగా అంటావేమో..
దాంతో నిన్ను గెలవాలని మాత్రమే..
ఇంతకంటే ఏం చెప్పగలను...
నచ్చావు...
@నరేష్ గంటల
29/11/17

No comments:

Post a Comment